![]() |
![]() |

కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ ప్రోమో ఇంకొకటి రిలీజ్ అయ్యింది. ఇక ఈ ప్రోమో బిందాస్ గా ఉంది. ఇక రీతూ చేసిన పని గురించి శ్రీముఖి వర్ణిస్తూ చెప్పింది. "రీతూ రీసెంట్ గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వెళ్లి వంటలన్నీ నేర్చుకుని రెడీగా ఉందంటా..మరి ఎంత వరకు వచ్చింది నీ వంటల ప్రయాణం" అని అడిగేసరికి "వంటలు నేర్చుకుని నేర్చుకుని తన ప్యాంటు కూడా చిరిగిపోయింది" అంటూ ఆమె వేసుకొచ్చిన టెర్ జీన్స్ మీద సెటైర్స్ వేశారు శేఖర్ మాష్టర్. దానికి కౌంటర్ గా "మాష్టర్ ఎంత చూస్తున్నారు నన్ను" అంటూ రివర్స్ కౌంటర్ వేసింది రీతూ. ఇక ఎవరన్నా ఇంటికి వెళ్తే వెల్కమ్ డ్రింక్ ఇస్తారు అంటూ శ్రీముఖి అనేసరికి " మా ఇంటికి ఎవరన్నా వస్తే వెల్కమ్ డ్రింక్ ఇవ్వను వెల్కమ్ స్పీచ్ ఇస్తాను..అంతే వాళ్ళు వెళ్ళిపోతారు" అని చెప్పింది బ్రహ్మముడి కావ్య. దాంతో అందరూ నవ్వేశారు.
తరువాత కావ్యను "నాన్న నీకు టెస్టులు చేసే ఎక్స్పీరియన్స్ లు ఉన్నాయా" అని శ్రీముఖి అడిగేసరికి "అక్కా నేను వంట గదిలో పుట్టిన వంటలక్క" అని శ్రీముఖికి కౌంటర్ ఇచ్చింది. ఇక రాజుని చూసి "ఏరా రాజు ఎప్పుడైనా స్టెల్లా కోసం వంట వండావా రా" అని శ్రీముఖి అడిగింది " ప్రస్తుతానికి వంట మొత్తం నేనే చేసి పెడుతున్న" అని చెప్పాడు యాదమ్మ రాజు. దానికి అందరూ నవ్వేశారు. చివరిలో బచ్చలికూర తెమ్మని ఒక టాస్క్ ఇచ్చేసరికి అటు బాయ్స్ ఇటు గర్ల్స్ తెగ అరిచేసుకున్నారు. దాంతో అమర్ దీప్ రీతూ మీద అరిచేసాడు. ఇలా ఈ వారం షో అరుపులు, గోలలతో ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది.
![]() |
![]() |